విశాఖ కలెక్టరేట్‌లో నేడు పీజీఆర్‌ఎస్‌

విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలకు అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరవుతారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను పూర్తి వివరాలతో సమర్పించాలని, అలాగే ‘మీ కోసం’ కాల్ సెంటర్ 1100 సేవలు, వెబ్‌సైట్‌ను వినియోగించుకోవాలని సూచించారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను అధికారులు సమీక్షిస్తారు.

సంబంధిత పోస్ట్