సమాజంలోని పేద, బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు. దుర్గా ఆదర్శనగర్‌లో వితంతు, వృద్ధులు, దివ్యాంగులకు నూతన పింఛన్లు పంపిణీ సందర్భంగా మాట్లాడుతూ వారికి గౌరవప్రదమైన జీవితం కోసం ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు.