విశాఖ: బాధితులకు మెరుగైన వైద్యం

గాజువాక సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడిన బాధితులను జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ ఆసుపత్రిలో పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రమాద వివరాలు తెలుసుకుని సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్