విశాఖ: రైల్వే ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో ముగ్గురు రైల్వే జోనల్ జీఎంలతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో పాటు ఈస్ట్ కోస్ట్, సౌత్ కోస్ట్ రైల్వేల జీఎంలు ఈ భేటీలో పాల్గొన్నారు. అమరావతి లైన్, కోటిపల్లి–నర్సాపూర్, నడికుడి–శ్రీకాళహస్తి వంటి కీలక ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. కొత్త రైల్వే లైన్లు, ఆర్‌ఓబీ ల నిర్మాణం వేగవంతం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ప్రధాన జంక్షన్లలో రద్దీ నియంత్రణ, కనెక్టివిటీ పెంపుపై రైల్వే అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమావేశానికి ముందు జీఎం శ్రీవాస్తవ కాజీపేట–విజయవాడ సెక్షన్‌లో భద్రతా అంశాలను తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్