విశాఖ: అవినీతి ఆరోపణలు నిరాధారం

హెడ్ నర్సుల పదోన్నతుల విషయంలో తమపై వచ్చిన అవినీతి ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ప్రభుత్వ నర్సుల సంఘం విశాఖ జిల్లా ప్రతినిధులు స్పష్టం చేశారు. సిటిజన్స్ ఫోరం ప్రతినిధులు చేసిన ఫిర్యాదు మేరకు డాక్టర్ మీనాక్షి ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ఈ విచారణకు నర్సుల సంఘం జిల్లా అధ్యక్షురాలు గంగాభవానీ, కార్యదర్శి వరలక్ష్మితో పాటు 39 మంది హెడ్ నర్సులు హాజరయ్యారు. ఆరోపణలు చేసిన ఫిర్యాదుదారులు విచారణకు గైర్హాజరయ్యారు. పదోన్నతుల కోసం ఎవరి నుంచి ఎలాంటి నగదు వసూలు చేయలేదని, తమపై కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని సంఘం నాయకులు పేర్కొన్నారు. విచారణ అధికారులకు తాము పూర్తి వివరాలు అందజేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్