విశాఖ‌: వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు జీవీఎంసీ శ్రీకారం

విశాఖ జీవీఎంసీ తూర్పు జోన్ 15వ వార్డులో బల్క్ వ్యర్థాల ఉత్పత్తిదారులకు అవగాహన కార్యక్రమం జరిగింది. జీవీఎంసీ అదనపు కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ, వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు మూలం నుంచే శ్రీకారం చుట్టాలని, స్థలంలోనే కంపోస్టింగ్, చెత్త వేరుచేయడం వంటి పద్ధతులు పాటించాలని సూచించారు. బల్క్ వ్యర్థాల ఉత్పత్తిదారులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు వికేంద్రీకృత వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలను అమలు చేయాలని కోరారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2025-26లో విశాఖను దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్