విశాఖ: కేజీహెచ్‌లో అంధ‌కారంపై వైద్య ఆరోగ్య శాఖ సీరియ‌స్‌

ఉత్తరాంధ్ర ప్రజలకు ఆరోగ్య ప్రదాయిని అయిన విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆసుపత్రి అంధకారంలో మునిగిపోయింది. ఇంత పెద్ద ఆసుపత్రికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో వైద్య ఆరోగ్య శాఖ తీవ్రంగా స్పందించింది. కనీసం జనరేటర్లు కూడా అందుబాటులో ఉంచుకోకపోవడంపై సూపరింటెండెంట్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. వైసీపీ ఇప్పటికే దీనిపై తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.

సంబంధిత పోస్ట్