గాజువాకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి, విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి రాంప్రసాదరెడ్డి, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఆదివారం పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, గాజువాక ప్రమాదం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు, ఆర్టీసీ తరపున అదనంగా మరో మూడు లక్షలు ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.