విశాఖపట్నం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తన పర్యటన ముగించుకుని మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఐఎన్‌ఎస్ డేగా నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తిరుగుపయనమయ్యారు. విమానాశ్రయం వద్ద రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, సీపీ శంఖబ్రత బాగ్చి తదితరులు రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు.