జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో గురువారం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సమీక్ష నిర్వహించారు. విశాఖలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. పబ్లిక్ వర్క్స్, మెకానికల్ పనులు, తాగునీటి సరఫరా వంటి అంశాలపై చర్చించారు. అభివృద్ధి పనుల అంచనాల్లో పూర్తి వివరాలు పొందుపరచాలని సూచించారు.