విశాఖ: విశ్వ‌నాథ్ స్పోర్ట్స్ క్ల‌బ్‌కు కోర్టులో చుక్కెదురు

విశాఖపట్నం పోర్టు యాజమాన్యం అక్కయ్యపాలెంలోని విశ్వనాథ్ ఎవెన్యూస్‌కు చెందిన స్టేడియం, కళావాణి ఆడిటోరియం లీజును రద్దు చేసింది. బాలుడి మరణం, అనుమతులు లేకపోవడం, సబ్-లీజు వంటి నిబంధనల ఉల్లంఘన దీనికి కారణమని పోర్టు యాజమాన్యం తెలిపింది. లీజు రద్దుపై విశ్వనాథ్ ఎవెన్యూస్ కోర్టుకు వెళ్లగా, పోర్టుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో పోర్టు యాజమాన్యం తక్షణమే ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసింది. లేదంటే అనధికార ఆక్రమణగా పరిగణించి, ఎలాంటి ఒప్పందాలు చెల్లవని హెచ్చరిస్తూ నోటీసు బోర్డులను ఏర్పాటు చేసింది.

సంబంధిత పోస్ట్