విశాఖ: రేపు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్‌ఏడీ, మాధవ ధార ఫీడర్ల పరిధిలో మరమ్మతులు కారణంగా శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్టు ఈఈ నాయుడు గురువారం తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాకేతపురం, రెల్లివీధి, వినోద్‌నగర్‌, విమాన్‌ నగర్‌, కాకాని నగర్‌, ఎన్‌ఎడి, పంజాబీ దాబా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్