చేనేత కార్మికులకు వేతనాలు పెంపు

AP: ఆప్కోకు ఉత్పత్తులను సరఫరా చేసే సహకార సంఘాల్లో పని చేసే చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చేనేత కార్మికుల వేతనాలను రూ.3 వేల చొప్పున పెంచుతున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. అలాగే ప్రాసెసింగ్ ఛార్జీల్లోనూ పెంపు ఉంటుందన్నారు. బ్లీచింగ్ ఛార్జీలు బండిల్‌కు రూ.129 నుంచి రూ.148, డైయింగ్‌కు రూ.362 నుంచి రూ.434, టవల్ నేత మజూరి రూ.30 నుంచి రూ.40, బెడ్‌షీట్ నేత మజూరి రూ.83 నుండి రూ.100కి పెరగనుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్