త్వరలో ఏపీ విద్యారంగంలోకి "ఏఐ ట్యూటర్"ను తెస్తాం: లోకేష్

AP: తాడేపల్లిలో నిర్వహించిన 'షైనింగ్ స్టార్స్' కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. కష్టపడి చదివి తమ కలలను సాకారం చేసుకోవాలని, ఆ కలలను నెరవేర్చేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సమాజంలో మార్పు తీసుకురావాలంటే యువతలో కొందరు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో "ఏఐ ట్యూటర్"ను ప్రవేశపెడతామని వెల్లడించారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు కృత్రిమ మేధ (AI) శిక్షణ అందించేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్