పోలియో రహిత సమాజానికి కృషి చేద్దాం: కలెక్టర్

పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. ఆదివారం తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చంటిబిడ్డలకు పోలియో చుక్కలు వేసి ఆమె ఈ పిలుపునిచ్చారు. పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్ల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌‌వో గీతాబాయి తదితర వైద్య అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్