ఆచంట నియోజకవర్గంలోని వల్లూరు గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. రూ. 2.50 లక్షల డిపాజిట్ వ్యవహారంపై రైతులు చేసిన ఫిర్యాదుతో అధికారులు సంఘం రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. నగదు లావాదేవీలు, రసీదులు, ఖాతా పుస్తకాల నిర్వహణపై ఆరా తీశారు. ఇటీవల పదవీ విరమణ చేసిన అధికారి వ్యవహార శైలిపై కూడా లోతుగా విచారణ జరుగుతున్నట్లు సమాచారం. ఈ తనిఖీలతో రైతులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు.