ఆచంట ప్రభుత్వ ఆసుపత్రిలో నిండు గర్భిణీ పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై పలువురు మండిపడుతున్నారు. ఆచంట వేమవరం గ్రామానికి చెందిన గర్భిణీకి ప్రసవ నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకురాగా, వైద్యులు అందుబాటులో లేరని, వేరే ఆసుపత్రికి వెళ్లాలని సిబ్బంది తెలిపారు. సుమారు రెండు గంటల పాటు నొప్పులతో బాధపడుతున్నా సిబ్బంది కనికరించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి, దిక్కుతోచని స్థితిలో గర్భిణీని పాలకొల్లులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్య సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.