భీమవరం మండలంలోని లోసరి, దెయ్యాలతిప్ప, తోకతిప్ప, నాగేంద్రపురం గ్రామాల్లో మంగళవారం విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. లోసరిలో కొత్త ఉపకేంద్రం పనుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ అంతరాయం ఆక్వా చెరువులకు కూడా వర్తిస్తుందని ఆయన వివరించారు.