సిద్ధాంతంలో సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 9వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్లను మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీలించారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి కలెక్టర్ హెలిపాడ్, సభా స్థలి, పార్కింగ్ ప్రదేశాలను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు.

సంబంధిత పోస్ట్