ఆశ్రమాన్ని సందర్శించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం చిన అమిరం మేజర్ పంచాయతీలోని శ్రీ స్వామి యోగీశ్వరానందగిరి శాంతి ఆశ్రమాన్ని శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి శాసన సభ్యులు కనుమూరి రఘురామకృష్ణరాజు శనివారం సందర్శించారు. ఆశ్రమ నిర్వాహకులు వృద్ధులకు అందిస్తున్న సేవలు, సంరక్షణ, సౌకర్యాలను ఆయన ప్రశంసించారు. వృద్ధుల సంక్షేమం కోసం నిస్వార్థంగా సేవలందిస్తున్న వారి సేవాభావం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్