పశ్చిమగోదావరి జిల్లాలో 35 నుండి 40 సంవత్సరాల సుదీర్ఘ సేవ తర్వాత ఉద్యోగ బాధ్యతల నుండి పదవీ విరమణ చేసిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్., మరియు పోలీస్ అధికారులు ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేసి, ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, వ్యక్తిగత సుఖాలను, కుటుంబ వ్యవహారాలను పక్కన పెట్టి, అహోరాత్రులు ప్రజా రక్షణ కోసం శ్రమించి, ఎటువంటి విమర్శలకు తావులేకుండా సగర్వంగా పదవీ విరమణ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.