జిల్లాలో జరుగుతున్న గృహ గణన నమోదు కార్యక్రమాన్ని మరో రెండు రోజుల్లో నూరు శాతం పూర్తి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పురపాలక, మండలాల వారీగా ప్రగతిని సమీక్షించారు. నిర్దేశిత గడువులోపు ఈ ప్రక్రియను పూర్తి చేయడం అత్యంత ముఖ్యమని కలెక్టర్ అన్నారు.