భూ వివాదాల పరిష్కారంపై ప్రత్యేక విచారణ

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్స్ కార్యక్రమాల కింద భూ వివాదాలపై ప్రత్యేక విచారణ జరిగింది. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ విచారణలో 15 (22-ఏ) కేసులను పరిశీలించారు. వీటిలో 7 కేసులు పూర్తిగా పరిష్కరించబడ్డాయి, ఒక కేసు తిరస్కరించబడింది. మిగిలిన 7 కేసులు పత్రాల లోపం కారణంగా వచ్చే వారానికి వాయిదా పడ్డాయని కలెక్టర్ తెలిపారు. ఈ విచారణలో తహసీల్దార్లు, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్