వీరవాసరం మండలం మత్స్యపురిలో పంచాయతీ చెరువును ఆక్రమించుకుని నివాసముంటున్న 27 గృహాలను అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య తొలగిస్తున్నారు. ఏళ్ల తరబడి చెరువును ఆక్రమించుకున్న వారికి గ్రామంలోనే వేరేచోట ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని అధికారులు సూచించినా వారు అంగీకరించలేదు. దీంతో అధికారులు హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ఆదేశాలతో ప్రోక్లైన్ల సాయంతో గృహాలను తొలగిస్తున్నారు. ఆక్రమణదారులు ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎలా అని అధికారులను ప్రశ్నిస్తున్నారు.