జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు ఆధ్వర్యంలో శనివారం పోలీస్ స్టేషన్ వద్ద విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా నంబరు బోర్డులు లేని 40 ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి నెంబర్ బోర్డులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నేరాల నియంత్రణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.