గురువారం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి రికార్డులను పరిశీలించి, రోగుల నుంచి వైద్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. డయాలసిస్ విభాగంతో సహా అన్ని విభాగాలను పరిశీలించి, సిబ్బంది నుంచి సమాచారం సేకరించారు.