లింగపాలెం: పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించిన పోలీసులు

లింగపాలెం మండలం తువ్వచిలకరాయుడుపాలెంలో "పల్లె నిద్ర" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సుస్మిత, సీఐ క్రాంతికుమార్, ఎస్ఐ వెంకన్న మరియు సిబ్బంది గ్రామస్థులతో మాట్లాడి అవగాహన కల్పించారు. తక్కువ డబ్బుకు ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పేవారి మాటలు నమ్మవద్దని, గ్రామంలో శాంతి భద్రతలు కాపాడుతూ అందరూ కలిసిమెలిసి ఉండాలని సూచించారు. వేసవిలో దొంగతనాలు పెరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్