ఈ నెల 30న చింతలపూడిలో ఐఓసీఎల్ పైప్ లైన్ వద్ద మాక్ డ్రిల్ నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. రసాయనిక పరిశ్రమలలో విపత్తు సమయంలో తీసుకోవలసిన జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించేందుకు ఈ డ్రిల్ జరుగుతుంది. ఈ మాక్ డ్రిల్ లో సంబంధిత శాఖల అధికారులు పాల్గొంటారు. కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ నిర్వహించబడుతుంది.