ఏలూరు జిల్లాలో అటవీ ప్రాంతాల గుర్తింపు, డిజిటైజేషన్, జియో-రిఫరెన్సింగ్ పనులను వేగవంతం చేసి నివేదికలు సమర్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్‌లో జేసీ అభిషేక్ గౌడ, డీఎఫ్‌ఓ సందీప్ రెడ్డిలతో కలిసి ఆమె పనుల ప్రగతిని సమీక్షించారు. రికార్డులు, గెజిట్ నోటిఫికేషన్లు, మ్యాప్‌ల ఆధారంగా అటవీ బ్లాక్‌లను డిజిటైజ్ చేయాలని, క్షేత్రస్థాయిలో వాటిని విధిగా ధ్రువీకరించుకోవాలని సూచించారు.