ఏలూరు జిల్లా డీఎంహెచ్‌వోగా డాక్టర్ పి. జాన్ అమృతం గురువారం ఏలూరులోని జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో విధుల్లో చేరారు. ఇప్పటివరకు డీఎంహెచ్‌వోగా పనిచేసిన డాక్టర్ మాలిని బదిలీపై గుంటూరు నగర పాలకసంస్థ మెడికల్ అండ్ హెల్తాఫీసర్‌గా బదిలీ అయ్యారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించి వైద్య శాఖలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని బాధ్యతగా పనిచేస్తామని అన్నారు.