ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జనతా వారధి కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పట్టణంలోని అక్కమ్మ కోనేరు సుందరీకరణ పనుల్లో జరుగుతున్న జాప్యం, ఏపీ గ్రీన్ & బ్యూటిఫికేషన్ డిపార్ట్మెంట్ పనులు పూర్తి కాకపోయినా పూర్తయినట్లు చూపించడం వంటి సమస్యలను వారు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.