ఏలూరు: పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతి

పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప శివ కిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఎస్పీ (నాన్ క్యాడర్) సూర్యచంద్రరావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకున్నారు. 1914 మార్చి 28న అనంతపురం జిల్లా చియ్యేడు గ్రామంలో జన్మించిన నారాయణాచార్యులు గొప్ప పండితుడని, చిన్నప్పటి నుంచే సాహిత్యం, సంగీతం, నాట్యంలో ప్రావీణ్యం సాధించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్