ఏలూరు: సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మవద్దు

ఏలూరు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వదంతుల నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ ఏలూరులో ఆకస్మిక పర్యటన నిర్వహించారు. ఫైర్ స్టేషన్, పెట్రోల్ బంకులను తనిఖీ చేసి, సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని అధికారులు నిర్ధారించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కేవలం వదంతులేనని, వాటిని నమ్మవద్దని కలెక్టర్ సూచించారు. జిల్లాలో అవసరాలకు సరిపడా ఇంధనం అందుబాటులో ఉందని, అధికంగా కొనుగోలు చేయవద్దని తెలిపారు. వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్