ఏలూరు: స్వీయ గణనపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్వీయ గణనపై ప్రజలకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఏలూరులోని ఇండోర్ స్టేడియం నుండి 5కె రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. 16వ జనగణనలో భాగంగా, కేంద్ర ప్రభుత్వం ఈనెల 30వ తేదీ వరకు https://se.census.gov.in పోర్టల్ ద్వారా స్వీయ గణనకు అవకాశం కల్పించిందని తెలిపారు. కుటుంబ యజమాని పేరు, కుటుంబ సభ్యుల వివరాలు, చిరునామా, గృహం, విద్యుత్, త్రాగునీరు వంటి ప్రాథమిక సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్