శనివారం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. గుండె చికిత్స కోసం విజయవాడ వంటి ప్రాంతాలకు రోగులను రిఫర్ చేస్తున్నారని, ఏలూరు GHHలోనే హృదయ చికిత్సకు అవసరమైన పరికరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు వైద్య సేవలను సులభతరం చేయాలని ఆయన సూచించారు.