ఏలూరు: ఆ రోజు భారీ వాహనాలకు అనుమతి లేదు

ఏలూరు పడమర వీధిలో ఆదివారం జరగనున్న గంగానమ్మ జాతర ఏర్పాట్లను ఏలూరు రేంజ్ ఐజి జివిజి అశోక్ కుమార్, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పరిశీలించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 800 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాతర రోజుల్లో, అంటే 1వ తేదీ ఉదయం 5 గంటల నుండి 2వ తేదీ అర్ధరాత్రి వరకు భారీ వాహనాలకు అనుమతి లేదని సూచించారు.

సంబంధిత పోస్ట్