కలెక్టర్ వెట్రి సెల్వి ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు బుధవారం జూమ్ కాన్ఫరెన్స్‌లో కలుసుకున్నారు. జిల్లాలో 1,810 ప్రభుత్వ, 558 ప్రైవేటు స్కూల్స్, 140 జూనియర్ కాలేజీల విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు మెగా పేరెంట్, టీచర్ మీటింగ్ నిర్వహించనున్నారు. వక్తృత్వం, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలను కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ కార్యక్రమంలో సూచించారు. తల్లిదండ్రుల కోసం లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్, టగ్ ఆఫ్ వార్ వంటి ఆటలు నిర్వహించాలన్నారు.