ఏలూరు ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను ఎస్పీ ప్రతాప్ కిషోర్ సమీక్షించారు. వారి వినతులను స్వయంగా స్వీకరించి సమగ్రంగా వివరాలు తెలుసుకున్నారు. త్వరితగతిన పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చారు.