ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతి వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని ఆమె అన్నారు.