ఏలూరు జెడ్పీ సీఈఓగా జగదాంబ

ఏలూరు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారిగా పి. జగదాంబ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, జగదాంబను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లా అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేయాలని చైర్‌పర్సన్ సూచించారు. జగదాంబకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్