ఏలూరులో కొర్ల బండి ఊరేగింపు రూట్ మ్యాప్

ఏలూరు పడమర వీధి గంగానమ్మ జాతర ముగింపు సందర్భంగా సోమవారం నిర్వహించనున్న కొర్ల బండి ఊరేగింపు మార్గాన్ని పోలీసులు ప్రకటించారు. ఈ ఊరేగింపు పడమర వీధిలో ప్రారంభమై గడియార స్తంభం, బిర్లా భవన్, రామకోటి, గాంధీ మైదానం, జూట్ మిల్, పాత బస్టాండ్, అల్లూరి సీతారామరాజు స్టేడియం మీదుగా ఆశ్రమ ఆసుపత్రి రోడ్డు వద్ద ముగుస్తుంది. భక్తులు, వాహనదారులు సూచించిన మార్గాన్ని అనుసరించాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్