ఏలూరు కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్‌లు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా కార్యాలయాలకు వచ్చి వినతులు అందజేయవచ్చని, meekosam. ap. gov. in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చని, 1100 టోల్ ఫ్రీ నంబరు ద్వారా వాటి స్థితిగతులను తెలుసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో చేపట్టబడింది.