ఉంగుటూరు నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై సమీక్ష

ఏలూరు కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వితో కలిసి ఉంగుటూరు ఎమ్మెల్యే శ్రీ పత్సమట్ల ధర్మరాజు నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నిచర్, క్రీడా మైదానాల ఏర్పాటు వంటి ప్రాథమిక సదుపాయాలపై చర్చించారు. నారాయణపురం మహాత్మా గాంధీ ప్రభుత్వ జూనియర్ కాలేజీ కూల్చివేత, పునర్నిర్మాణ పనుల పురోగతిని కూడా సమీక్షించారు.

సంబంధిత పోస్ట్