ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఎస్పీ ప్రతాప్ కిషోర్ వార్షిక తనిఖీలు నిర్వహించారు. స్టేషన్‌కు చేరుకున్న ఎస్పీకి సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయన పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, వివిధ కేసులకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించారు. స్టేషన్ పనితీరుపై ఆరా తీస్తూ, పెండింగ్‌లో ఉన్న అంశాలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. తనిఖీలు కొనసాగుతున్నాయి.