పెట్రోల్, డీజిల్ నిల్వలపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేందుకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ఏలూరులోని పలు పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తూర్పువీధి ఎస్‌వీ ఫిల్లింగ్ స్టేషన్, వసంత మహల్ సమీపంలోని రిలయన్స్ బంక్, జూట్ మిల్ సెంటర్‌లోని చలమయ్య బంక్‌లలో ఇంధన నిల్వలు, రికార్డులు, కంప్యూటర్ డేటాను పరిశీలించారు. ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా, అక్రమాలు జరగకుండా ప్రతి బంక్ వద్ద రెవెన్యూ మరియు పోలీసు సిబ్బందితో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.