కైకలూరులో 1వ అదనపు సివిల్ జడ్జి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మానవేంద్రరాయ్ బుధవారం ప్రారంభించారు. నూతన కోర్టు భవనాన్ని ప్రారంభించిన అనంతరం న్యాయ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువ కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దేవానంద్, జస్టిస్ వెనుతిరుమల్లి గోపాలకృష్ణారావు, ఎం. కిరణ్మయి పాల్గొన్నారు.