కైకలూరులో స్కూల్ బస్సుల తనిఖీలు

కైకలూరు పోలీసులు గురువారం పట్టణంలోని విద్యాసంస్థల బస్సులను తనిఖీ చేశారు. ఎస్సై వెంకట కుమార్ వాహనాల ఫిట్‌నెస్, బ్రేకులు, టైర్ల సామర్థ్యం, అత్యవసర ద్వారాలను పరిశీలించారు. నిబంధనలు పాటించని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, డ్రైవర్లకు సూచనలు చేశారు. చిన్న పొరపాటు కూడా ప్రాణాల మీదకు వస్తుందని, అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్