పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ ఆకస్మికంగా వీధుల్లో తనిఖీలు చేపట్టారు. పలు వార్డుల్లో పేరుకుపోయిన చెత్తను చూసి మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే స్వయంగా చెత్తను తొలగింపజేసి, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ట్రాక్టర్ లోకి మోస్తూ శ్రమదానం చేశారు. పట్టణ పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు.