రేపు నరసాపురంలో పీజీఆర్ఎస్

నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం యథావిధిగా ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నరసాపురం ఆర్డీవో దాసిరాజు తెలిపారు. డివిజన్లోని అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని, సబ్ డివిజన్లోని అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. ప్రజలు తమ ఫిర్యాదులు, దరఖాస్తులను ఉదయం 10:30 గంటల నుంచి అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్