మొగల్తూరులో ఎస్సై సీహెచ్ జి. వాసు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ ధరించని, అతివేగంగా, మొబైల్ వాడుతూ డ్రైవింగ్ చేసిన వాహనదారులకు జరిమానాలు విధించారు. వాహనదారులు నిబంధనలు పాటించడం వారి బాధ్యతతో పాటు భద్రత అని ఎస్సై వాసు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.